![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ కావడానికి ఇంకా ఒక్క రోజు గడువు మాత్రమే ఉంది. అలాంటి టైములో ఒక యంగ్ అండ్ డైనమిక్ పెయిర్ హౌస్ లోకి రాము అంటూ చెప్పేసింది. బిగ్ బాస్ 6 సీజన్స్ పూర్తి చేసుకుని ఇప్పుడు న్యూ సీజన్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సారి ఉల్టా పల్టా అంటూ సరికొత్త వెర్షన్ లో రాబోతుంది. ఆరో సీజన్ పై ఆడియన్స్ నుంచి బాగా నెగిటివిటీ రావడంతో బిగ్ బాస్ నిర్వహకులు ఈ సారి పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. ఇక ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తి అయింది. ఇక ఈ షోకి బిగ్ బాస్ లోకి సీరియల్ నటి, యూట్యూబర్ అంజలి పవన్ వెళ్తున్నట్లుగా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఐతే బిగ్ బాస్ టీం సంప్రదించి.. ఆమెతో ఒప్పందం కూడా చేసుకున్నారట. ఐతే అనుకోని కారణంతో ఆమె హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం లేదనే విషయం తెలుస్తోంది. ఆమె పలు సీరియల్స్ లో నటిస్తూ... సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది.
రీసెంట్ గా "నీతోనే డాన్స్" షోలో ఈ జంట అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఫైనల్స్ వరకు వెళ్లారు. ఈ షో ఎన్నాళ్ళు ఈ జంటకి నటరాజ్ మాష్టర్ జంట మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నట్టుగా ఉండేది. ఐతే ఇప్పుడు బిగ్ బాస్ టీం ఇచ్చే రెమ్యూనరేషన్ విషయంలో భేదాభిప్రాయాలు వచ్చి ఆమె హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం లేదనే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మొగలి రేకులు సీరియల్తో అంజలి పవన్ బాగా పాపులర్ అయ్యింది. మధ్యమధ్యలో సినిమాల్లో కూడా నటిస్తూ మంచి ఇమేజ్ దక్కించుకుంది. కొంతకాలం క్రితం ప్రసారమైన మిస్టర్ అండ్ మిసెస్ షోలో కూడా ఈ జంట మెరిసింది. వీళ్లిద్దరికీ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే వీళ్ళ కూతురు ధన్వికతో కలిసి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లో ఎన్నో వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు.
![]() |
![]() |